విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన టీం మొత్తాన్ని మార్చేసినట్లు తెలుస్తోంది. కొత్తవారిని ఈ సినిమా కోసం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో స్టార్ట్ కానున్నట్లు సమాచారం.