NTR: విజయవాడలో నేడు నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ వేడుకలకు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి పున్నమి ఘాట్లో ఈ ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. గవర్నర్ రాక నేపథ్యంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.