KDP: కడప ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మనోజ్ రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా వెస్ట్, నార్త్ జోన్లను శుక్రవారం ఉదయం ఆయన సందర్శించారు. కాగా, 50వ డివిజన్ రూకవారిపల్లిలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి రోజు చెత్త సేకరిస్తున్నారా?లేదా? అని ఆరా తీశారు.