మేడ్చల్: దేవరయంజాలలో ప్రభుత్వ భూముల కబ్జా జరుగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడంలేదని అక్కడి ప్రజలు ఆరోపించారు. గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ 641లో నిర్మాణాలు జరుగుతున్నాయని, విషయాన్ని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ చర్యలు లేకపోవడం పై ఆగ్రహించిన ప్రజలు, అక్రమాలను ప్రోత్సహిస్తే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.