AP: మెగా డీఎస్సీ విజేతలకు సచివాలయం సమీపంలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15,941 మంది విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ‘డీఎస్సీ అంటే CBN, CBN అంటే డీఎస్సీ’ అని పొగిడారు.