AP: రాష్ట్రంలో మెగా డీఎస్సీ విజేతలకు కాసేపట్లో నియామక పత్రాలను అందజేయనున్నారు. అసెంబ్లీ భవనం వెనుక ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, మాధవ్ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రం వైరల్ ఫీవర్ కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. కాగా, కూటమి ప్రభుత్వం ఇటీవల మెగా డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.