NLR: 43 వేల కోట్లు అవినీతికి పాల్పడినట్టు విచారణలో తేలి, సీబీఐ పెట్టిన 13 కేసుల్లో ముద్దాయి అయిన వ్యక్తి గతంలో ఐదేళ్లు సీఎంగా వ్యవహరించి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజాసొత్తును దోచుకున్నారని తెలిపారు.