సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో గురువారం శక్తి టీమ్ బృందాలు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. మహిళలు, బాలికలు ఆపదలో ఉన్నప్పుడు శక్తి యాప్ సహాయం అందిస్తుందని తెలిపారు. SOS బటన్ లేదా డయల్ 112 ద్వారా ఫిర్యాదు చేస్తే పది నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారని వివరించారు.