NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో స్వచ్ఛ్ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ప్రసాద్ రెడ్డి గురువారం నాడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న సంత మార్కెట్లో ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి శ్రమదానం చేశారు. గ్రామంలో ఉన్న ప్రజలు పరిశుభ్రత పాటించాలని ఆయన తెలిపారు.