ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన చెవి, ముక్కు, గొంతు పరీక్షల ఉచిత వైద్య శిబిరాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ సిబ్బందికి పోలీస్ కమిషనర్ సూచించారు.