VZM: యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలం ఆధ్వర్యంలో విజయనగరంలో గురువారం దసరా ఉత్సవాల సందర్భంగా కార్ కార్నివాల్ ఉత్సవాన్ని కంటోన్మెంట్ శాఖ వద్ద(R&B జంక్షన్) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు అతితక్కువ వడ్డీ రేట్లకు కార్ల ఋణాలను అందిస్తూన్నామన్నారు. లబ్ధిదారులకు కొత్త కార్లను బ్యాంకు జనరల్ మేనేజర్ శాలిని మీనన్ చేతుల మీదుగా డెలివరీ చేశారు.