చాలా కాలం తర్వాత టీమిండియాలోకి తిరిగి వచ్చిన ప్లేయర్ కరుణ్ నాయర్‌కు విండీస్‌తో జరిగే టెస్ట్‌లో అవకాశం దక్కలేదు. IPL, దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాతే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌కు ఎంపికయ్యాడు. అయితే నాయర్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు ఈసారి అతడికి అవకాశం కల్పించలేదు.