VSP: కనకమహాలక్ష్మి అమ్మవారి శరనవరాత్రి మహోత్సవముల నాల్గవ రోజు సందర్భంగా గురువారం అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లడ్డులతో సహస్రనామార్చన జరిగింది. విశాఖ వాసి ఎస్.రామ రవీంద్ర రూ. 75,000 విరాళం సమర్పించారు. పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.