SKLM: కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో విశేష భక్తజన సందోహం మధ్య గురువారం ఓ చిన్నారి తప్పిపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అవుట్ పోస్ట్ పోలీసులు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం (మైక్) ద్వారా ఆ చిన్నారిని క్షణాల్లో వారి తల్లిదండ్రులకు అప్పచెప్పారు.