MBNR: చిన్నచింతకుంట మండలంలోని దామగ్నపూర్ గ్రామంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డితో కలిసి నూతన లైబ్రరీనీ దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో లైబ్రరీలు ఉండటం వల్ల ప్రపంచ జ్ఞానాన్ని సులభంగా పొందేందుకు వీలు కల్పిస్తాయనీ, ఇది గ్రామీణ ప్రజలకు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.