ADB: పవన్ కళ్యాణ్ కేరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా OG చిత్రం నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు జక్కుల కార్తీక్ అన్నారు. OG చిత్రం అభిమానులకు దసరా పండుగ వారం రోజుల ముందే వచ్చిందన్న ఆనందంలో సంబరాలు చేసుకుంటున్నామని తెలిపారు. అటు నటుడుగా, ఇటు రాజకీయ నాయకుడిగా తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.