NLG: జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో సహా అన్ని రకాల చేయూత / ఆసరా పింఛన్ల పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతుందని గురువారం డీఆర్డీవో శేఖర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు పింఛను మొత్తాన్ని నేరుగా పోస్టల్ శాఖ వారి నుంచి మాత్రమే పొందాలన్నారు. మధ్య దళారులను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.