ATP: జిల్లా కలెక్టర్ ఆనంద్ నిషేధిత ప్లాస్టిక్ వాడకూడదని తెలిపారు. కలెక్టరేట్లో డిస్కవర్ అనంతపురం వారు తయారు చేసిన కాన్వాస్, బట్ట సంచులను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 0.5 మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని కలుతుందని చెప్పారు. నిషేధిత ప్లాస్టిక్ బదులు క్లాత్ బ్యాగులను వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.