కృష్ణా: గుడివాడలో సైకిల్ తొక్కడానికి వెళ్లిన ఓ బాలుడిపై వీధి కుక్కలు బుధవారం దాడి చేశాయి. ఆ వీధి కుక్కల నుండి తప్పించుకునే క్రమంలో బాలుడు సైకిల్‌ను స్పీడ్‌గా తొక్కగా,అదుపు తప్పి కింద పడిపోయాడు. ఆ బాలుడిపై 4 కుక్కలు దాడి చేశాయి. వాహనదారులు కుక్కల నుండి బాలుడిని రక్షించి,తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.