CTR: చిత్తూరు పట్టణ పరిధిలోని కట్టమంచి బైపాస్ రోడ్డు పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్‌ను ఆదేశించారు. బుధవారం చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ గాంధీ రోడ్డు, కట్టమంచి బైపాస్ రోడ్, దొడ్డిపల్లి ఎన్టీఆర్ హౌసింగ్ లే అవుట్లను ఆయన పరిశీలించారు.