SRD: సింగూర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(GRMB) చైర్మన్ పాండ్య అన్నారు. బుధవారం ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రాజెక్టు పరిసరాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టారు. రోడ్డు పక్కన ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్రాజెక్టు పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.