NLR: ఉమ్మడి నెల్లూరు జిల్లా కలువాయి మండలం పరిధిలోని ఉయ్యాలపల్లి గ్రామంలో నుసేటి విష్ణువర్ధన్, మనుబొటి నవ శ్రావణ్ అనే ఇద్దరు పిల్లలు అదృశ్యం అయ్యారు. దసరా సెలవులు కావడంతో షికారుగా అడవికి వెళ్లినట్లు సమాచారం. సాయంత్రం అయిన గ్రామంలో లేకపోయేసరికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు వెతకడం ప్రారంభించారు.