GNTR: తెనాలి నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రూ.40 లక్షల కరెన్సీతో అమ్మవారికి విశేషంగా అలంకరణలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.