WGL: బతుకమ్మ ఉత్సవాల ఏర్పాటుకు ప్రభుత్వం, గ్రామ పంచాయితీలకు సరిపడా నిధులు కేటాయించని మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజల పండుగ బతుకమ్మను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పంచాయితీలకు అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామస్థాయిలో ఏర్పాట్లు కష్టాల్లో పడ్డాయని తెలిపారు. తక్షణం ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.