MBNR: పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళకు అంబులెన్సులో ప్రసవం జరిగింది. బాలానగర్ పెద్దబావి తాండకు చెందిన మహిళకు బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం ఇచ్చారు. అంబులెన్సు సిబ్బంది,మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. EMT రాధిక, పైలెట్ సమయస్ఫూర్తితో తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.