HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటి వరకు సాధారణం కంటే అధికంగా 42.3% వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 24 వరకు సాధారణంగా 593.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా… 844.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.