AP: టమాటా ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో రూ.3 మాత్రమే ధర పలుకుతోందని వ్యక్తం చేస్తున్నారు. 25 కిలోల టమాటా గంపలను వ్యాపారులు రూ.150 నుంచి రూ.300 లోపు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. కాగా, బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.20 వరకూ ఉంది.