ASF: విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, సాంకేతికపరమైన సేవలు అందించేందుకు TGNPDCL యాప్ రూపొందించినట్లు ఆసిఫాబాద్ జిల్లా SE రాథోడ్ శేషారావు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 20 ఫీచర్లతో ఈ యాప్ అందుబాటులో ఉందని, దీని ద్వారా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.