IND vs BAN మ్యాచ్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇన్నాళ్లు అత్యధిక T20 వికెట్లు తీసిన బంగ్లా బౌలర్గా షకీబ్అల్ హసన్(149) సరసన కొనసాగిన ముస్తాఫిజుర్.. నిన్న సూర్యను ఔట్ చేయడం ద్వారా ఆ రికార్డును తన వశం చేసుకున్నాడు. ప్రస్తుతం షకీబ్ రెండో స్థానంలో.. తస్కిన్ అహ్మద్(99), మెహిదీ హసన్(61) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.