BHPL: గణపురం మండలం చెల్పూర్కు చెందిన షేక్ జమీర్ పాషా, దివ్యాంగుల ఉద్యోగ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. హైదరాబాదులో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హబీబ్ మియా ఆధ్వర్యంలో ఆయన ఎంపికయ్యారు. పాషా మాట్లాడుతూ.. ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కాగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.