MBNR: మిడ్జిల్ తహశీల్దార్ పులి రాజు బుధవారం తన కార్యాలయంలో గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది హుటాహుటిన హైదరాబాద్లోని పంజాగుట్టలో ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మార్వో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.