KRNL: పెద్దకడబూరు మండలం మేకడోన గ్రామంలో మైనారిటీలకు స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని AIYF తాలూకా అధ్యక్షుడు జాఫర్ పటేల్, ఉసేన్ భాషా కోరారు. బుధవారం MRO గీతాప్రియదర్శినికు వినతి పత్రం అందజేశారు. దాదాపు 350 గృహాలు కలిగిన గ్రామంలో మైనారిటీలకు స్మశాన వాటిక లేకపోవడంతో సమీప ఇళ్ల దగ్గరే పూడ్చుకునే దుస్థితి నెలకొందన్నారు.