AP: అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం మాచిరెడ్డిగారిపల్లిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎర్రచందనం తరలిస్తున్న తమిళ కూలీలను పోలీసులు వెంబడించారు. కూలీల దాడిలో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ సంఘటనలో 12 మంది తమిళ మహిళా కూలీలను అదుపులోకి తీసుకుని.. 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.