HYDను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన HCA సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(GCC)ను రాయదుర్గంలో ప్రారంభించారు. అమెరికా, యూకేలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌కు 190 ఆసుపత్రులు, 2,400 కేర్ సైట్లు ఉన్నాయి.