కోనసీమ: యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముమ్మిడివరం ఎస్సై డీ. జ్వాలాసాగర్ పేర్కొన్నారు. బుధవారం ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో డ్రగ్స్‌పై అవగాహన సభ, ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత గంజాయి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.