HYD: మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వతా నగర్ రూట్లో రోడ్డు అనేక చోట్ల గుంతల మయంగా మారటం, పలుచోట్ల రోడ్డు పూర్తిగా కొట్టుకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలతో మరమ్మత్తు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అలర్ట్ చేసిన పోలీసులు, పనులు పూర్తయ్యే వరకు మరో రెండు రోజులు వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాలన్నారు.