TPT: శ్రీవారి బ్రహోత్సవాల నేపథ్యంలో శ్రీనివాసుడికి వైజాగ్‌కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజ్ ఎండీ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కానుకగా అందజేశారు. 3.860 కేజీల బరువు గల వజ్రాలు పొదిగిన ఈ ఆభరణాన్ని బుధవారం వారు రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు.