NGKL: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో ఈనెల 26న శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ సింగ్ బుధవారం తెలిపారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా దాదాపు 50 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన 25 ఏళ్ల నుంచి 32 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు.