ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని సినీ నటుడు రఘుబాబు బుధవారం ఎంపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు కాసేపు సరదాగా మాట్లాడారు. వ్యక్తిగత పనులపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రావినూతలపాడుకు వచ్చిన రఘుబాబు, అనంతరం ఒంగోలుకు చేరుకుని ఎంపీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రఘుబాబు నటిస్తున్న సినిమాల గురించి ఎంపీ మాగుంట ఆరా తీశారు.