పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ ‘A’ సర్టిఫికెట్ రావడంతో 18ఏళ్లు పైబడిన వారికి మాత్రమే థియేటర్లలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ నేపథ్యంలో బుక్ మై షో.. ఎవరైనా మైనర్లు టికెట్లు బుక్ చేసుకుని ఉంటే.. వారి టికెట్ డబ్బులు తిరిగిస్తామని తెలిపింది. ఇవాళ సాయంత్రం 6 గంటలోపు టికెట్ బుక్ చేసుకున్న వారి ఫోన్‌కి లింక్ వస్తుందని, దాన్ని ఓపెన్ చేసి క్యాన్సిల్ చేసుకోవాలని పేర్కొంది.