GDWL: ఆత్మకూరు- గద్వాల, కొత్తపల్లి మీదుగా జూరాల వద్ద హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితమ్మకు వినతిపత్రం సమర్పించారు. బుధవారం ఈ వినతిపత్రాన్ని స్వీకరించిన సరితమ్మ మాట్లాడుతూ.. హైలెవెల్ వంతెన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఈ ప్రాంతంలో వంతెన లేకపోవడం వలన ప్రజలు 24 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తుందన్నారు.