SRPT: ఈనెల 28, 29, 30 తేదీల్లో సూర్యాపేటలో జరగనున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు తొట్ల అచ్చయ్య కోరారు. శనివారం నూతనకల్ మండలం చిల్పకుంట్లలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. వృత్తి కోసం గీత కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాడాలన్నారు.