WNP: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేడు అప్రెంటిషిప్ మేళా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ కే. రమేష్ బాబు తెలిపారు. ఐటీఐ పాస్ అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్ధులు అప్రెంటీషిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేళాకు ధ్రువీకరణ పత్రాలతో రావాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 984924403 సంప్రదించాలన్నారు.