AP: పల్నాడు జిల్లా రెడ్డిగూడెంలో బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు వచ్చారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది.