NTR: కొత్తపేట పోలీసులు జూదం శిబిరాలపై దాడులు నిర్వహించారు. గత మూడు రోజులుగా వరుసగా దాడులు నిర్వహిస్తూ పలువురుపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సైతం ఓల్డ్ ఆర్ఆర్ పేటలో జూదం ఆడుతున్నారన్న స్థానికుల సమాచారం మేరకు దాడి చేశామని సీఐ కొండలరావు తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకొని రూ.18 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.