BHPL: గణపురం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ఆయురారోగ్యాలతో సుఖసంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.