W.G: ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భీమవరంలో శనివారం కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి సైక్లోథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విష్ణు కళాశాల నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు వారు సైకిల్ తొక్కుతూ ఆరోగ్య సందేశాన్ని ఇచ్చారు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు. ఇకపై నెలలో ఒక రోజు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.