BHPL: రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.