MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రోడ్డు నిర్మాణానికి అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. గ్రామం నుంచి రఘుపతి గుట్ట దేవాలయం వరకు సుమారు రెండు కోట్ల 60 లక్షల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో నిధులు మంజూరు కావడంతో నేడు అధికారులు సర్వే నిర్వహించారు.