AP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొందరి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలపై సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ ఇతర అంశాలపై సీనియర్ నేతలతో సీఎం మాట్లాడినట్లు సమాచారం.